ఏపీ మంత్రులని మరోసారి గిచ్చిన నాని..!

టాలీవుడ్ టైర్ 2 హీరోస్ లో టాప్ హీరో అయినటువంటి నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం “దసరా” తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని తాను సొంతం చేసుకోగా ఈ ఏడాదిలోనే మరో సినిమాతో అందులోని తన కెరీర్ లో 30వ సినిమాతో మరోసారి థియేటర్స్ లోకి రాబోతున్నాడు.

కాగా ఆ చిత్రమే “హాయ్ నాన్న”. ఈ సినిమాతో టాలీవుడ్ కి కొత్త దర్శకుడు శౌర్యువ్ పరిచయం అవుతున్నాడు. మరి ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ కోసం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ని ఇప్పుడు చిత్ర బృందం స్టార్ట్ చేయగా లేటెస్ట్ గా పాలిటిక్స్ ని కలుపుతూ చేసిన ప్రమోషన్స్ వైరల్ గా మారాయి.

అయితే ఇందులో నాని వేసిన కొన్ని సెటైర్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆ మధ్య ఏపీలో టికెట్ రేట్స్ విషయంలో ఎంత తతంగం నడిచిందో తెలిసిందే. నాని కూడా అప్పుడు టికెట్ ధరలు విషయంలో తన గళం విప్పగా పవన్ కళ్యాణ్ కూడా నానికి అభినందనలు తెలిపాడు. కాగా అప్పుడు నాని చేసిన కామెంట్స్ పట్ల ఏపీ మంత్రులు కూడా ఘాటు విమర్శలు చేశారు.

అయితే వాటికే మళ్ళీ సెటైర్ లాగ మన పార్టీ హాయ్ నాన్న అధికారంలోకి అందరి ఆదాయం పెరిగే ఆదాయం పెరిగేలా థియేటర్స్ ఆదాయం పక్కనే ఉండే కిరాణా కొట్ల ఆదాయం అలాగే సందర్భం సబ్జెక్ట్ లేకుండా వారి శాఖలకు సంబంధం లేకుండా స్పందించే వాళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చేస్తామని తెలిపాడు. దీనితో నానిపై గతంలో విమర్శలు చేసిన కొందరు ఏపీ మంత్రులకి గిచ్చేలా నాని రిటర్న్ సెటైర్ వేసాడు అని ఈ క్లిప్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. 
https://x.com/NameisNani/status/1725863035208912981?s=20