ట్రైలర్ టాక్ : ఊహించని విధంగా నాని “హాయ్ నాన్న”..!

ఈ డిసెంబర్ లో టాలీవుడ్ సినిమా నుంచి రానున్న కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ఒకదానిని మించి ఒకటి కంటెంట్ ఓరియెంటెడ్ సహా భారీ సినిమాలు ఉండగా ఈ చిత్రాలు మొదట అనుకున్న డేట్ కన్నా కాస్త ముందే వస్తుండగా ఆ చిత్రాల్లో నేచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు అయినటువంటి శౌర్యువ్ తెరకెక్కించిన చిత్రం “హాయ్ నాన్న” కూడా ఒకటి.

కాగా ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించగా ఆమె నటించిన ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రయిలర్ మాత్రం డెఫినెట్ గా ఊహించని విధంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాని చాలా మంది తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. 

కానీ ట్రైలర్ చూసాక మాత్రం చాలా మంది అభిప్రాయాలు మారవచ్చని చెప్పాలి. మెయిన్ గా నాని తన భార్య విషయంలో చెప్పే అబద్దపు కథలు కానీ తన కూతురు అడిగినపుడు నిజం చెప్పడం వంటివి చాలా ఎమోషనల్ గా అనిపిస్తున్నాయి. అలాగే సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రమే కాకుండా హీరోయిన్ శృతి హాసన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ఇంకా ఈ ట్రైలర్ కి మరి హైలైట్ సంగీత దర్శకుడు హీశం అబ్దుల్ ఇచ్చిన స్కోర్ అని చెప్పాలి దీనితో ఈ ట్రైలర్ మరింత అందంగా సినిమాపై ఓ ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చాయి. ఇలా మొత్తంగా అయితే ఒక ఊహించని ఎమోషనల్ రైడ్ ని నాని ఈ డిసెంబర్ 7న అందిస్తున్నది చెప్పాల్సిందే. 
HI NANNA: Official Trailer | Nani, Mrunal T | Baby Kiara K| Shouryuv | Hesham Abdul Wahab