నాని ‘మాస్’ స్టామినా ప్రూవ్ చేసిన “దసరా”.!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోలని స్టార్డం, సీనియార్టీ బట్టి అయితే టైర్ 1, టైర్ 2 అని ఇలా విభజించుకున్నారు. మరి లిస్ట్ లో అయితే టైర్ 2 లో నాచురల్ స్టార్ నాని సినిమాలకి సాలిడ్ మార్కెట్ మరియు మంచి వసూళ్లు ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి.

కొన్ని సినిమాలు మినహా మంచి టాక్ గాని వస్తే నానికి మెయిన్ గా మాస్ సినిమాలతో మంచి మార్కెట్ ఉంది. అయితే తన మార్కెట్ కి ఏ రేంజ్ వసూళ్లు నమోదు కొల్లగొట్టగలడు అనేది మాత్రం లేటెస్ట్ గా తన “దసరా” సినిమా చూపించింది అని చెప్పాలి.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో చేసిన ఈ సినిమా ఓ భారీ మాస్ సినిమాగా వచ్చింది. మరి దీనికి అయితే అనూహ్యంగా రికార్డు ఓపెనింగ్స్ రావడం ఇదే రేంజ్ లో కొనసాగుతూ ఉండడం అనేది ఆసక్తిగా మారింది. అంతే కాకుండా ఓ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ గా కూడా ఈ సినిమా ఇప్పుడు దూసుకెళ్తుంది.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా నాని తన మాస్ చూపిస్తున్నాడు. తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ ని యూఎస్ లో కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ చేసేయనుండడం మరో దసరా తో మరో నిదర్శనం. దీనితో అయితే నాని కి కొంచెం రొటీన్ మాస్ సినిమాలకే ఓ రేంజ్ లో వసూళ్లు వచ్చినపుడు ఇక ఈ తరహా సాలిడ్ కంటెంట్ ఉన్న మాస్ సినిమాలతో అయితే ఏ రేంజ్ వసూళ్లు సెట్ చేయగలడో చూపించాడని చెప్పడంలో సందేహం లేదు.