నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. నాని కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇక త్వరలోనే సాంగ్స్ కూడా సందడి చేయబోతున్నాయి. అయితే నాని దసరా సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దసరా సినిమా సక్సెస్ అయితే మాత్రం అంతకంటే ఎక్కువ స్థాయిలోనే నాని తదుపరి సినిమాలు చేయాల్సి ఉంటుంది. కానీ అతను మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఊహించిన విధంగా విభిన్నమైన దర్శకులను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.
అయితే ఈ క్రమంలో నాని మరోసారి తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు తోనే సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదర్శకుడు మరెవరోకాదు అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ అని తెలుస్తోంది. ఆ సినిమా బోర్ కొట్టించింది అని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమా సక్సెస్ ఉన్నట్లుగానే కాస్త హడావిడి చేసేసారు.
అయినప్పటికీ నాని మాత్రం వివేక్ ఆత్రేయతో మరో సినిమా చేయాలి అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. దసరా హడావిడి మొత్తం పూర్తయిన తర్వాత నాని మరోసారి ఆ డైరెక్టర్ తో కూర్చోబోతున్నాడు. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చితే కనుక అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ కూడా ఇదే ఏడాది మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.