Antey Sundaraniki : నాని పంచెకట్టు పాట అందరికి తెగ నచ్చేసింది… సక్సెస్ ను ఎంజాయ్ చేసిన టీం…!

Antey Sundaraniki : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం అంటే సుందరానికి. ఇపుడు మూస చిత్రాలను కాకుండా విభిన్నంగా చిత్రాలను ఎంచుకోవడం నాని స్టైల్. ఈ మధ్యనే శ్యామ్ సింగ్ రాయ్ తో మంచి క్లాసికల్ హిట్ కొట్టిన నాని వెంటనే అంటే సుందరానికి అంటూ బయలుదేరాడు.

అంటే సుందరానికి సినిమా ను వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మొదటిసారి మలయాళం ముద్దుగుమ్మ నజ్రియా నటిస్తోంది.ఇక ఈ సినిమాలోని పంచె కట్టు అను పాటను చిత్ర బృందం లిరికల్ సాంగ్ వీడియో ను యూ ట్యూబ్ లో విడుదల చేసారు.ఈ పాటకు అనూహ్య స్పందన రావడంతో చిత్ర బృందం పంచె కట్టు పార్టీ అంటూ పాట సక్సెస్ ను ఎంజాయ్ చేశారు. వివేక్ ఆత్రేయ ఫ్యూషన్ మ్యూజిక్ స్టైల్ లో విడుదలైన ఈ పాట అందరిని ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇక ఈ సినిమా లో నజ్రియా ఒక లీలా థామస్ గా నాని సుందరంగా మనలను నవ్వించబోతున్నారు. ఈ సినిమాను జూన్ 10 న విడుదలచేయాలని అనుకుంటున్నారు దర్శకులు. ఇక అధికారికంగా అపుడే ప్రకటించారు. చూడాలి అంటే సుందరానికి సినిమాతో నానికీ ఎన్ని మార్కులు పడతాయో..