ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే ఎక్కువగా ఫోకస్ చేసేది రిలీజ్ డేట్ కోసమే కరెక్ట్ టైమ్ లో రిలీజ్ అయితేనే కలెక్షన్స్ బాగా వస్తాయనేది కొందరి బలమైన నమ్మకం. ఇక ప్రస్తుతం రిస్క్ అని తెలిసినా కూడా బాక్సాఫీస్ వద్ద కయ్యానికి కాలు దువ్వుతున్నారు కొందరు హీరోలు. అయితే తెలిసి తెలిసి సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడేలా చెయ్యకూడదని మరికొందరు రిలీజ్ డేట్స్ ను మార్చుకుంటున్నారు.
మొత్తానికి నాని తన టక్ జగదీష్ సినిమాను వాయిదా వేశాడు. ఈ సినిమాను మొదట ఏప్రిల్ 16న విడుదల చేయాలని ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత లవ్ స్టొరీ సినిమా కూడా అదే డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టొరీపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక నాని నటించిన టక్ జగదీష్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే ఎంతో కొంత కలెక్షన్స్ పై ప్రభావం తప్పకుండా పడుతుంది. అయితే హీరో నాని నిర్మాతలతో స్పెషల్ గా చర్చలు జరిపి రిలీజ్ డేట్స్ ను మార్పించినట్లు సమాచారం. ఇక టక్ జగదీష్ ను ఫైనల్ గా జనవరి 23న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.