ఇన్సైడ్ టాక్ : “దసరా” రిజల్ట్ నానికి నచ్చలేదా?

Dasara-Still-7-1024x576

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో అయితే మంచి బజ్ గట్టి ప్రమోషన్స్ ని జరుపుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “దసరా” కూడా ఒకటి.

అయితే ఈ సినిమా నాని కెరీర్ లో ఆల్ టైం రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేయడమే కాకుండా టైర్ 2 హీరోస్ లో భారీ రికార్డు సెట్ చేసింది. అంతేనా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా 2 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టి తన కెరీర్ లోనే గేమ్ ఛేంజింగ్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా విజయం పట్ల నాని అసంతృప్తి గానే ఉన్నాడని సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్. కాగా ఈ సినిమా ఒక్క తెలుగు వెర్షన్ మినహా మరే ఇతర భాషలో కూడా రాణించలేదు. ముఖ్యంగా హిందీ రిలీజ్ పై నాని చాలా అంచనాలు పెట్టుకున్నాడు. అక్కడ పలు చిత్రాల్లా మైండ్ బ్లాకింగ్ వసూళ్లు కొట్టేస్తుంది అనుకున్నాడు.

కానీ ఈ సినిమాకి హిందీ జనం షాకింగ్ రిజల్ట్ ఇచ్చారు. నార్త్ లో ఈ సినిమాకి 10 కోట్లు కూడా రాలేదు. దీనితో ఈ సినిమా పాన్ ఇండియా రిజల్ట్ విషయంలో మాత్రం నాని అంత సంతృప్తిగా లేడనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అయితే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి వారు కమర్షియల్ గా మొదటి హిట్ ని తమ బ్యానర్ లో అందుకున్నారు.