టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా నాని కి మంచి పేరుంది. దర్శక నిర్మాతలు నాని తో సినిమా చేయడానికి ముఖ్య కారణం నాని తో సినిమా చేసిన నిర్మాతలు రోడ్డున పడ్డ దాఖలాలు ఎక్కడా లేకపోవడమే. అదే నాని కి వరసగా సినిమాలు అవకాశాలని కల్పిస్తోంది. అయితే ఈ మధ్య నాని సినిమాలు బాక్సఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని 25 వ సినిమా గా ఇటీవలే ‘వి’ సినిమా వచ్చింది. సుధీర్ బాబు మరో హీరో కాగా.. అదితి రావ్ హైదరి – నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.
భారీ అంచనాల మధ్య అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన ఈ సినిమా సూపర్ హిట్ అని అందరు ముందుగానే బ్లైండ్ గా ఫికైయ్యారు. కాని అందరి అంచనాలను తారుమారు చేసింది. యావరేజ్.. బిలో యావరేజ్ అన్న టాక్ వచ్చింది. థియోటర్స్ లో రిలీజయి ఉంటే జనాలు ఎలాంటి కామెంట్స్ చేశారో మరి. వరసగా ఫ్లాప్స్ చూస్తున్న నాని ఈ సినిమా కూడా ఫ్లాపయి షాకిచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ వి ‘ నాని ని తీవ్రంగా నిరాశపరచిందని అంటున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు.
మేకింగ్ పరంగా దర్శకుడు కి మంచి ప్రశంసలు దక్కాయి. దిల్ రాజు నిర్మాణ విలువలు బావున్నాయన్న టాక్ వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన సుధీర్ బాబు కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా సినిమా పోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారంటే అందుకు కారణం కథ అని అన్నారు. ఈ సినిమా ఎవరికైనా లైఫ్ ఇచ్చిందంటే ఒక్క సుధీర్ బాబు కి మాత్రమే. అయితే నాని కథ వినకుండా వి సినిమా చేశాడా.. ఇప్పుడు అందరికీ కలుగుతున్న అనుమానం. ఇంతక ముందు కూడా నాని మీద ఇలాంటి కామెంట్సే వచ్చాయి. మరి నిజంగా నాని దర్శకుల మీద నమ్మకంతో కథ వినకుండా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే మాత్రం ఇకనుంచైనా పంథా మార్చుకోవాలి.