‘దసరా’ వంటి మాస్‌ మసాలా తర్వాత నాని ఓ క్లాసికల్‌ సినిమా!

టైటిల్‌ పోస్టర్‌ నుంచి పాజిటీవ్‌ వైబ్స్‌ ఏర్పరుచుకున్న సినిమా ‘హాయ్‌ నాన్న’. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, ప్రోమోలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ మంచి హైప్‌ తెచ్చిపెట్టాయి. పైగా ‘దసరా’ వంటి మాస్‌ మసాలా తర్వాత నాని ఓ క్లాసికల్‌ సినిమాతో రానుండటం జనాలను తీవ్ర ఎగ్‌జైట్‌మెంట్‌కు గురి చేస్తుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ సినిమాపై బజ్‌ పెంచేందుకు అప్పుడప్పుడు ఆసక్తికర అప్‌డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు. సమయమా అంటూ సాగే బ్యూటిఫుల్‌ మెలోడి సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. హేషమ్‌ ఎప్పటిలాగే ఓ అందమైన మెలోడి ట్యూన్‌ను ఇచ్చాడు. సాంగ్‌ వింటున్నంత సేపు మరో వరల్డ్‌ లోకి తీసుకెళ్లాడు.

అంతే బ్యూటీఫుల్‌గా అనురాగ్‌ కలకర్ణి, సితార కృష్ణకుమార్‌ ఈ పాటను ఆలపించారు. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ సైతం క్యాచీగా ఉన్నాయి. డౌటే లేదు నాని కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మెలోడియస్‌ సాంగ్‌లో ఇది కూడా చేరుతుంది. ఇటీవలే ఖుషితో బిగ్గెస్ట్‌ అప్లాజేస్‌ అందుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌కు ఇది కూడా బెస్ట్‌ ఆల్బమ్‌ అవుతుందని తెలుస్తుంది.

ఫాదర్‌ డాటర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నాడు. నానికి జోడీగా సీతారామం బ్యూటీ మృనాళ్‌ థాకూర్‌ నటిస్తుంది. ఇక ఈ సినిమాకు పోటీగా వెంకటేష్‌ పాన్‌ ఇండియా మూవీ సైంధవ్‌, షారుఖ్‌ డుంకీ, హాలీవుడ్‌ మూడి అక్వామ్యాన్‌`2 రిలీజవుతున్నాయి. ఇన్ని సినిమాల పోటీలను తట్టుకుని ఈ ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా నిలబడుతుందా లేదా అనేది చూడాలి.