గాసిప్ : మలయాళ క్రేజీ డైరెక్టర్ ని హోల్డ్ లో పెట్టిన నాచురల్ స్టార్.?

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ని పరిచయం చేస్తూ నాచురల్ స్టార్ నాని చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “దసరా” కూడా ఒకటి. మరి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి హిట్ కాగా నాని లైనప్ పై కూడా మంచి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే నాని దసరా లాంటి భారీ కమర్షియల్ సినిమా వెంటనే పూర్తిగా సంబంధం లేకుండా డిఫరెంట్ క్లాస్ చిత్రాన్ని అయితే టేకప్ చేసాడు. ఇక ఈ సినిమా తర్వాత అయితే నాని మలయాళం నుంచి ఓ క్రేజీ డైరెక్టర్ తో అయితే సినిమా ఓకే చేయాల్సి ఉందని ఇపుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

సీక్వెల్స్ విషయంలో పెద్ద హిట్ ఏది అంటే అది బాహుబలి 2 అంటారు కానీ ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ థ్రిల్లర్ చిత్రాలు తీస్తే వాటిలో ఉండే సినిమా “దృశ్యం”. దీని సీక్వెల్ ని అద్భుతంగా తీసి అప్పట్లో ఓటిటి లో రిలీజ్ చేసేసి డిజప్పాయింట్ చేసిన దర్శకుడు జీతూ జోసెఫ్ తో నాని సినిమా చేయాల్సి ఉందట.

కాగా ఈ సీక్వెల్ కి అప్పట్లో ఇండియన్ సినిమా దగ్గరే ది బెస్ట్ సీక్వెల్ అని విమర్శకులు చెప్పారు. మరి ఇలాంటి డైరెక్టర్ కథ చెప్తే నాని ఇంకా దానిని హోల్డ్ లో పెట్టాడని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా తెరవరకు వెళ్తుందా లేక పేపర్ మీదనే ఆగిపోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.