రానా బాటలో నాని.! వెబ్ సిరీస్‌కి ‘సై’.!

ప్రస్తుతం ‘దసరా’ పనుల్లో బిజీగా వున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సందట్లోనే ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తన వద్దకు ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో అప్రోచ్ అయ్యాడట. సబ్జెక్ట్ బాగా నచ్చేయడంతో నాని, సింపుల్‌గా ‘ఓకే’ చెప్పేశాడట. అయితే, అది సినిమా కోసం కాదండోయ్, ఓ వెబ్ సిరీస్ కోసమట.!

ఇటీవల నాని స్నేహితుడు, సినీ నటుడు రానా దగ్గుబాటి ‘రానా నాయుడు’ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. పచ్చి బూతుల వెబ్ సిరీస్ అది. అయినాగానీ, రానా కొత్తగా ట్రై చేస్తుంటాడంటూ నాని కితాబులిచ్చేశాడు తన స్నేహితుడికి. మరోపక్క, నాని చేయబోయే వెబ్ సిరీస్ కూడా ‘రా’ యాంగిల్‌లో వుంటుందట. అంటే, ‘రానా నాయుడు’ తరహా అన్నమాట. అయితే, ‘రానా నాయుడు’ సిరీస్‌తో రానాని ప్రేక్షకులు తిట్టి తిట్టి వదిలి పెట్టారు.

సివరాఖరికి రానా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇంత జరిగాకా నాని అలాంటి రిస్క్ ఎందుకు చేస్తున్నాడో ఏమో కానీ, ఈ విషయమై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది.