నాని దసరా.. అసలు ఆట షురూ!

టాలీవుడ్‌ నేచురల్ స్టార్‌ నాని ప్రస్తుతం దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యూడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్‌ ప్రేక్షుకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నాని రగ్గడ్‌ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ అయితే వస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

అదేమిటంటే.. ఈ సినిమా ట్రైలర్ నెక్ట్‌ వీక్ ఉంటుందని సమాచారం. అయితే దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో మార్చి 30వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రచార పర్వం వేగవంతం చేశారు. ఇక వచ్చే వారమే ఈ సినిమా ట్రైలర్ ఉండనుందని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే నాని ప్రమోషన్స్ షూరు చేశాడు. ఇటివల ముంబయిలో కూడా నాని సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా నానికి గ్రాండ్ వెల్కమ్ అయితే దక్కింది. అక్కడి యువతతో రంగులు పూయించుకుంటూ, నాని సెల్ఫీ తీసుకున్న ఫోటోస్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. హిందీలో దసరాలోని డైలాగ్స్ చెప్పి అక్కడ కూడా నాని ఉత్సాహాన్ని నింపాడు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గని బ్యాక్‌డ్రాప్‌ విలేజ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం.

ఇక ఈ మూవీలో నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కీర్తిసురేశ్‌ నాని సరసన నటిస్తోంది. దసరా సినిమాలో సాయి కుమార్, స‌ముద్ర ఖని, జ‌రీనా వ‌హ‌బ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్‌ గా నిలిచాయి. ఇక దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇంకో ఆసక్తి కర విషయం ఏమింటంటే.. నానికి ఇది మొట్ట మొదటి పాన్ ఇండియా చిత్రం. చూడాలి ఇది ఏ మేర కలిసి వస్తోందోనని.