దసరా ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఫిక్స్!

భారీ అంచనాలున్న తెలుగు పాన్ ఇండియా సినిమా దసరా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLVC ప్రొడక్షన్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. గోదావరిఖని బొగ్గు గని నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ ఏడాది అత్యంత ఖరీదైన తెలుగు చిత్రాల్లో దసరా ఒకటిగా నిలిచింది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో ఈ చిత్రం దాదాపు 34.65 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు టాక్. ఇక నైజాంలో 13.7 కోట్ల రూపాయలు, సీడెడ్ 6.5 కోట్ల రూపాయలు గుంటూరులో 3 కోట్ల రూపాయల ధర పలికినట్లు టాక్. ఇక కర్నాటకలో ఈ చిత్రం దాదాపు 2.85 కోట్లు, ఇతర భాషల నుండి దాదాపు 1.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు సమాచారం.

నార్త్ ఇండియన్ రిలీజ్ విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు. ఇక సినిమా ఓవర్సీస్ లో కూడా విడుదల కాబోతోంది, అక్కడ అంచనా ప్రకారం 6 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. టోటల్ గా దసరాకి వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు 50 కోట్ల రూపాయలని అంచనా. ఇక ఈ సినిమా 51 కోట్ల రూపాయలతో బ్రేక్ ఈవెన్ సెట్ అయ్యింది. మరి ఈ టార్గెట్ ను దసరా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.