ఆ పాత్రకు కూడా నాని అంత అడుగుతున్నాడా??

నేచురల్ స్టార్ నాని, సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి అవకాశం వస్తే తప్పకుండా సూపర్ స్టార్ తో నటిస్తానని గతంలోనే నాని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ఇక మొత్తానికి ఇప్పుడు అతనికి ఆ అదృష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. జ్ఞాన్ వెల్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న రజనీకాంత్ 170వ సినిమాలో ఇప్పటికే ఊహించని స్టార్ క్యాస్ట్ టీం ఏర్పడింది. ముఖ్యంగా ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నాడు. ఇక మలయాళం లో నుంచి ఫాహాద్ ఫాజిల్ కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం స్పెషల్ పాత్ర చేసేందుకు నాని పారితోషికం విషయంలో గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతను హీరోగా దాదాపు పది నుంచి 12 కోట్ల రేంజ్ లో అయితే తీసుకుంటున్నాడు. దసరా సినిమాకు 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు రజనీకాంత్ 170 సినిమా కోసం ఆఫర్ రాగానే దాదాపు అదే తరహాలో అతను డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా ఈ విషయంలో నాని నుంచి అయితే ఎలాంటి నిర్ణయం రాలేదట. ప్రస్తుతం చర్చలు దశలోనే ఉన్నారు. ఇక త్వరలోనే మరొకసారి దర్శకుడు నానితో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురానున్నారు కొన్ని నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా దర్శకుడు సినిమాను సామాజిక అంశాలతో రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది.