Nani : నాని అంటే సుందరానికి సినిమా టీజర్ అప్పుడేనట….!

Nani : నాని ప్రతి సినిమాతో తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. విభిన్నమైన పాత్రాలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలే శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ఇపుడు అంటే సుందరానికి అంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి వైవిద్య భరితంగా వినోదాత్మకంగా ఉండబోతోంది.ఇక ఈ సినిమాలో నానికి జోడిగా నాజ్రియా మొదటి సాయిగా తెలుగు సినిమా చేస్తోంది.

ఇక ఈ సినిమాను వివేక్ అత్రేయ దర్శకత్వం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుడి సుందరంగా నటిస్తున్నారు. ఇక నజ్రియా లీలా థామస్ అనే క్రిస్టియన్ యువతీగా నటిస్తోంది. ఇక కులాంతర వివాహం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆద్యంతం కామెడీగా సాగనుందట. ఇక ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ అందించారు. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తమిళం లో ఆడడే సుందరం, ఆహా సుందరంగా మలయాళం లో కూడా ఈ సినిమా విడుదలవ్వబోతుంది.

ఇక ఈ సినిమా లో ఇతర కీలక పాత్రల్లో నదియా, రాహుల్ రామకృష్ణ, హర్ష వర్ధన్, సుహాస్ నటిస్తున్నారు.జూన్ 10న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు చిత్రం యూనిట్. ఇక సినిమా టీజర్ ను ఏప్రిల్ 20 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పటికే విడుదలైన టీజర్లు, పంచెకట్టు పాటకు మంచి స్పందన వచ్చి చిత్రం పై అంచనాలను పెంచేసింది.