హ్యాపీ మూడ్‌లో నాని, మృణల్‌

టాలీవుడ్‌ న్యాచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి హాయ్‌ నాన్న . తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ (డెబ్యూ డైరెక్టర్‌) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

కాగా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని టీం ప్రమోషన్స్‌ లో ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా హాయ్‌ నాన్న ట్రైలర్‌ అప్‌డేట్‌ అందించి మూవీ లవర్స్‌లో జోష్‌ నింపుతున్నారు మేకర్స్‌. ప్రేమ ప్రతిబింబం మ్యాజిక్‌ చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. నవంబర్‌ 24న విరాజ్‌, యష్నా ప్రపంచాన్ని చూసేందుకు కిటికీ తెరుచుకుంటుంది.. అంటూ ట్రైలర్‌ లాంఛింగ్‌ అప్‌డేట్‌ అందించి అందరినీ ఫుల్‌ ఖుషీ చేస్తున్నారు.

మృణాళ్‌ ఠాకూర్‌, నాని హ్యాపీ మూడ్‌లో చిల్‌ అవుట్‌ అవుతున్న ట్రైలర్‌ అప్‌డేట్‌ లుక్‌ ఇప్పుడు నెటిజన్లను ఫుల్‌ ఇంప్రెస్‌ చేస్తోంది. ఇప్పటికే హాయ్‌ నాన్న నుంచి విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌, గ్లింప్స్‌ వీడియో, సాంగ్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్‌ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

హాయ్‌ నాన్న నుంచి లాంఛ్‌ చేసిన సమయమా సాంగ్‌ మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతూ.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఫుల్‌ ఇంప్రెస్‌ చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్‌, హృదయం ఫేం హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు.