మరో తెలంగాణ నేపథ్య సినిమా కథ.. నానితో ‘బలగం’ వేణు సినిమా!

‘బలగం’ సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్న జబర్దస్త్‌ వేణు ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్‌ వేణు కాస్త ‘బలగం’ వేణుగా మారిపోయాడు. వేణు తన తరువాతి సినిమా కోసం నేచురల్‌ స్టార్‌ నానిని సెలెక్ట్‌ చేసుకున్నాడని టాక్‌.

ఈ కాంబోని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సెట్‌ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు పూర్తవగా.. నేరేషన్‌ కూడా కంప్లీట్‌ అయినట్లు సమాచారం. వేణు తన కెరీర్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ తోనే సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ప్రేక్షకులకు తన సహజ నటనతో దగ్గరైన నానితో..ఎలాంటి కథతో వస్తున్నాడనే ఉత్కంఠ కలుగుతోంది.

ఇప్పుడు ఈ న్యాచురల్‌ కాంబో నుంచి ఆసక్తికర లీక్‌ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమా తెలంగాణ పల్లెటూరిలో జరిగే ఓ పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ అని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. నాని కెరీర్‌లో ఇదివరకే ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో పీరియాడిక్‌ కాన్సెప్ట్‌ టచ్‌ చేశాడు.

ఇప్పుడు మళ్లీ నానితో కొత్తగా తెలంగాణ లవ్‌ స్టోరీతో.. ‘బలగం’ వేణు తనదైన పాత కాలానికి..ప్రేమలు హత్తుకునే సామ్రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. త్వరలో ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే నాని ‘హాయ్‌ నాన్న’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ ఎమోషనల్‌ కాన్సెప్ట్‌ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్‌ హిట్‌ గా నిలిచింది.