‘ఎన్‌కె ఆర్‌ 21’ టైటిల్‌తో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తాజా చిత్రం

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తాజాగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ ‘ఎన్‌కె ఆర్‌ 21’ ‘.. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, అశోక క్రియేషన్స్‌ అశోక్‌ వర్ధన్‌ ముప్పా , సునీల్‌ బులుసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ రోజు కళ్యాణ్‌ రామ్‌ జన్మదినం సందర్భంగా మేకర్స్‌ సినిమా నుంచి ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి కళ్యాణ్‌ రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ పోస్టర్‌లో చుట్టూ మనుషులు అగ్నికి అహుతై ఉండగా చేతిలో నిప్పుతో కల్యాణ్‌ రామ్‌ ఉన్న లుక్‌ను విడుదల చేసారు. విూరు ఆదర్శంగా ఉండలేకపోతే భయపెట్టే వాడిలా ఉండండి’ అంటూ డైలాగ్స్‌ ట్యాగ్‌ చేశారు. చిత్రంలో సాయి మంజ్రేక్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, లేడీ సూపర్‌ స్టార్‌ విజయ శాంతి ఓ కీలక పాత్ర పోషిస్తుంది. వీరితో పాటు బాలీవుడ్‌ నటుడు సోహైల్‌ ఖాన్‌, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎడాది చివరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.