ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముంబైకి బయల్దేరిన మహేష్ బాబు

Namrata Shirodkar says Mahesh babu Going to Mumbai

మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మంచు విష్ణు భార్య వెరానిక బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో సహా ఆ పార్టీలో మెరిశాడు. మంచు విష్ణు ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. మహేష్ బాబు గ్లామర్ గురించి కామెంట్ చేశాడు. మహేష్ బాబులోని మంచితనమే ఆ గ్లామర్‌కు రహస్యమని చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు చెప్పినట్టుగానే నిజంగా మహేష్ బాబు రోజురోజుకీ యంగ్‌గా మారిపోతున్నాడు.

Namrata Shirodkar says Mahesh babu Going to Mumbai
Namrata Shirodkar says Mahesh babu Going to Mumbai

తాజాగా మహేష్ బాబు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మహేష్ బాబు ట్రస్ట్, ఆర్గనైజేషన్ ద్వారా చిన్న పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలను ఫ్రీగా చేయిస్తూ ఇప్పటికీ వెయ్యికి పైగా పసి ప్రాణాలను నిలబెట్టాడు మహేష్ బాబు. తాజాగా 1020వ గుండెను మహేష్ బాబు కాపాడంటూ నమ్రత చెప్పుకొచ్చింది. అలా మహేష్ బాబు సేవా కార్యక్రమాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ప్రస్తుతం మహేష్ బాబు ముంబైకి చెక్కేస్తున్నాడు. ఈ మేరకు నమ్రత ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో మహేష్ బాబు స్టైల్, హెయిర్ స్టైల్ ఎంతో క్యూట్‌గా ఉంది. నమ్రత ఏదో కామెంట్ చేసినట్టుంది.. వీడియో తీస్తూ ఉంటే మహేష్ బాబు మాత్రం కుదరదన్నట్టుగా నో నో అని చెప్పేశాడు. అయినా కూడా నమ్రత వీడియోను తీసినట్టుంది. అయితే ముంబైకి వెళ్తున్నాడని చెప్పింది కానీ ఎందుకు వెళ్తున్నాడు.. ఏ పని మీద వెళ్తున్నాడని మాత్రం చెప్పలేదు.