బిగ్ బ్రేకింగ్.. డ్రగ్స్ కేసులో నమ్రత శిరోద్కర్!!

Bandla Ganesh ABout Allegation On Namrata Shirodkar In Drugs Case

బాలీవుడ్, శాండల్ వుడ్‌లో డ్రగ్స్ కేసులు ఎంతటి కలకలాన్ని సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లో రియా చక్రవర్తి అరెస్ట్ అయింది. విచారణలో భాగంగా ఆమె సారా అలీఖాన్, రకుల్ ప్రీత్, శ్రద్దా కపూర్, దీపిక పదుకొణె పేర్లు వెల్లడించినట్టు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఈ మేరకు నేటి ఉదయం నుంచి దీపిక పదుకొణె, మేనేజర్ కరిష్మాకు సంబంధించిన వాట్సప్ చాట్ లీకైంది.

namrata Shirodkar In Drug Case With Jaya saha
namrata Shirodkar In Drug Case With Jaya saha

అయితే ఈ కేసు తిరిగి తిరిగి టాలీవుడ్ మెడకు చుట్టుకునేలా ఉంది. రకుల్ పేరు వచ్చినప్పుడే టాలీవుడ్ సెలెబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సతీమణి నమ్రత పేరు వచ్చింది. ఆజ్ తక్ జాతీయ మీడియా ఈ మేరకు ఓ కథనాన్ని కూడా ప్రసారం చేసింది. దీంతో నమ్రత పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

namrata Shirodkar In Drug Case With Jaya saha
namrata Shirodkar In Drug Case With Jaya saha

టాలెంట్ మేనేజర్ జయా సాహాతో నమత్రకు లింకులు ఉన్నట్టు బయటపడింది. మాములూగా నమ్రతకు బాలీవుడ్ పరిచయాలు ఎక్కువే. అక్కడే మొదట ఎంట్రీ ఇచ్చింది. ఆపై టాలీవుడ్‌కు వచ్చింది. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో నమ్రతా శిరోద్కర్ పేరు తెర మీదకు రావడంతో అందరూ అది నిజమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా నమ్రత తొందరగా మేల్కొని ఏదో ఒక ప్రకటన చేస్తే మంచింది.