నా ప్రపంచం అప్పుడే ఆగిపోతుంది.. నమ్రత పోస్ట్ వైరల్

Namrata Shirodkar ABout Sitara

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలను వదిలేసి కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితమైన నమ్రత.. మహేష్‌కు అన్ని విధాల అండగా ఉంటూ వస్తోంది. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను నమ్రతే చూసుకుంటుంది. అలాంటి నమ్రత సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. పిల్లల అల్లరి, పిల్లలతో కలిసి మహేష్ బాబు చేసే సందడి గురించి నమ్రత చెబుతూ ఉంటుంది.

Namrata Shirodkar ABout Sitara
Namrata Shirodkar ABout Sitara

మహేష్ బాబు పర్సనల్ విషయాలు, ఆయన ఇంట్లో ఎలా ఉంటాడు.. పిల్లలతో కలిసి ఎలా అల్లరి చేస్తాడన్న విషయాలు తెలియాలంటే కచ్చితంగా సోషల్ మీడియాలో నమ్రతను ఫాలో అవ్వాల్సిందే. నమ్రత చేసే పోస్ట్‌లన్నీ కూడా ఫ్యామిలీకి సంబంధించినవే. అందులో ముఖ్యంగా మహేష్ బాబు గురించే ఉంటాయి. ఆ తరువాత సితార గురించిచెబుతూ ఉంటుంది. గౌతమ్ ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేయడు. కానీ ఈ ఇద్దరూ కలిసి గౌతమ్‌ను ఎక్కువగా ఏడిపిస్తుంటారు.

మహేష్ సితారాలు కలిసి గౌతమ్‌ను ఎంతలా ఆట పట్టిస్తారో చెప్పే వీడియోలెన్నో కూడా నమ్రత షేర్ చేసింది. ఇక నమ్రత తాజాగా మరో పోస్ట్ చేసింది. ఇందులో సితారా చిరు దరహాసాన్ని వదిలిసింది. చిన్నగా నవ్వుతూ మురిసిపోతోన్న సితారా ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోతో ఓ కామెంట్ పెట్టింది. సితారా ఎప్పుడైతే నవ్వుతుందో.. అప్పుడే నా ప్రపంచం ఆగిపోతుందని చెప్పుకొచ్చింది. ఇక సితారా నవ్వితే ఆమెనే చూస్తుంటాను.. వేరే ప్రపంచం ఉండదనే ఉద్దేశ్యంలో నమ్రత చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.