సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడిగా ఎప్పటికైనా గౌతమ్ ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఈ మధ్యే గౌతమ్ యవ్వన వయస్కుడిగా మారాడు. గౌతమ్ పద్నాలుగో పుట్టిన రోజు వేడుకలు ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఇంటి సభ్యులు, గౌతమ్ స్నేహితులు మాత్రమే ఈ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీ చేసిన రచ్చ మరేతర స్టార్ ఫ్యామిలీస్ చేయలేదు.
ఓ వైపు సితార క్యూట్ క్యూట్ మాటలు, పాటలు, స్టెప్పులతో రోజుకో వీడియోను విడుదల చేస్తూ నమత్ర అందర్నీ అలరించింది. మరో వైపు గౌతమ్‌ను తండ్రీ కూతుళ్లిద్దరూ కలిసి ఆట పట్టించిన వీడియోలను షేర్ చేసింది. గౌతమ్‌తో మహేష్ బాబు ఎత్తు విషయంలో పోటీ పడటం, సితారతో స్విమ్మింగ్ పూల్‌లో పోటీ పడటం, ఇంట్లో వీడియోలు గేమ్‌లు ఆడుకుంటూ ఉండటం వంటివి చేస్తూ సందడి సందడిగా గడిపారు.
తాజాగా గౌతమ్ ఫిట్‌నెస్ చూసిన వారికి షాక్ తగిలి ఉంటుంది. కాస్త లావు అయినట్టు కనిపించింది. ఇలాంటి మాటలన్నీ నమత్ర చెవిన పడ్డాయో ఏమిటో గానీ.. గౌతమ్ ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. దగ్గరుండి మరీ స్విమ్మింగ్ చేసేలా ఎక్కువ క్యాలరీలు కరిగించేలా చేస్తోంది. మొత్తానికి గౌతమ్ 302 మీటర్ల దూరం వెళ్లి.. 1021 కేలరీలను కరిగించాడట. ఇదే గౌతమ్ రికార్డ్ ఫీట్ అని.. తన కొడుకు ఘనతను సోషల్ మీడియాలో షేర్ చేసింది నమ్రత.