నాగార్జున సరసన అనుష్క.!

నాగార్జునకు అనుష్క ఓ సెంటిమెంట్. నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమాతోనే అనుష్క హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ మాటకొస్తే.. అనుష్కను ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కూడా నాగార్జునకే దక్కుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలొచ్చాయ్.

‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో ఓ చిన్న పాత్రలో నాగ్ కోసం అనుష్క తళుక్కున మెరిసింది. కాగా, ప్రస్తుతం అనుష్క రెగ్యులర్‌గా సినిమాలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే.

భారీగా పెరిగిన బరువు కారణంగా హీరోయిన్‌గా అనుష్క ఫేడవుట్ అయిపోయింది. ఈ టైమ్‌లో నాగార్జున మళ్లీ అనుష్కకు ఓ ఛాన్స్ ఇవ్వబోతున్నాడనీ సమాచారం.

ప్రస్తుతం నాగార్జున బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించబోతున్నాడు. అందులో ఓ సినిమాకి హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అనే ప్రచారం కూడా వుంది.

అయితే, ఏ సినిమానో తెలీదు కానీ, ఏదో ఒక సినిమాలో అనుష్క కోసం ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ డిజైన్ చేయించబోతున్నాడట నాగార్జున. అదేంటో తెలియాల్సి వుంది.