Home News బిగ్ బాస్ యూనిట్‌పై నాగార్జున సీరియస్..షో మధ్యలోనే వెళ్లిపోతానని వార్నింగ్

బిగ్ బాస్ యూనిట్‌పై నాగార్జున సీరియస్..షో మధ్యలోనే వెళ్లిపోతానని వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఓ రేంజ్‌లో క్లిక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది షో ఉండకపోవచ్చని చాలామంది భావించారు. అయితే పరిస్థితులు కుదుటపడటంతో అత్యంత జాగ్రత్తలు మధ్య నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. బిగ్ బాస్ విజయవంతం కావడంలో వ్యాఖ్యతలు ప్రధాన పాత్ర పోషిస్తారు. నాగార్జునకు ఎంత ఫ్యాన్ ఫాలోయంగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హెస్ట్ చేస్తే..ఎపిసోడ్లకు ఓ రేంజ్ రేటింగ్ వస్తోంది. అయితా తాజాగా బిగ్ బాస్ యూనిట్‌పై నాగార్జున ఫైరయ్యారట. ఇకపై ఇలానే జరిగితే షో ఆపేసి వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు గల కారణాల ఏంటో ఇప్పుడు చూద్దాం.

Nag Fire | Telugu Rajyam

గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో హోస్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో నాగార్జున అలవోకగా బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిదంటే తెలుగు లోగిళ్లలో స్టార్ మా ఛానల్ పెట్టి బిగ్ బాస్ చూడటం కామనైపోయింది. ఈ క్రమంలో ప్రారంభ ఎపిసోడ్లకు రికార్డు రేంజ్ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ అందుకుని దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. కంటెస్టెంట్లతో ఫన్ చెయ్యడంలోనూ, వార్నింగులు ఇవ్వడంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు నాగ్. బిగ్ బాస్‌ అంటే ఏమైనా జరగవచ్చు అన్న అభిప్రాయం వీక్షకుల్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఈ సీజన్‌లో జరిగిన పలు సంఘటనలు. అదరగొడుతోన్న కంటెస్టెంట్లలను మధ్యలోనే పంపించేయడడం, పులిహెర కలిపేవాళ్లను కంటిన్యూ చేయడం, లవ్ ట్రాకులు, ఓవర్ డోస్ రొమాన్స్, ఎలిమినేషన్ సహా వివిధ ప్రక్రియల గురించి వీక్షకుల్లో అహసనం మొదలైంది. తాము వేస్తోన్న ఓట్లు ఉపయోగ పడటం లేదని, తమను బపూన్ల మాదిరి ఆడుకుంటున్నారని కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా ఫైరయ్యారు.

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అని చెప్పుకుంటూ.. బిగ్ బాస్ తెలుగు షో అంశాలను నాటకీయంగా మార్చారు నిర్వాహకులు. అంతేకాదు ఇంట్లో ఏం జరిగినా ఒకరోజు ముందుగానే లీకైపోతుంది. దీంతో షోపై ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. ఆడియెన్స్ ఫలానా వాళ్లు ఈ వారం ఎలిమినేట్ చేస్తారని ముందే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యూనిట్‌పై నాగార్జున తీవ్రంగా ఫైరయ్యారట.ఇలాగైతే హోస్టింగ్ చేయకుండా మధ్యలో వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చారట. మరీ ముఖ్యంగా ప్రతి వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ముందే బయటకు వస్తే షో ఎవరు చూస్తారని ఆయన నిర్వహకులపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మరీ ఈ సారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా నిర్వాహకులు ఏం చేస్తారో చూడాలి.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News