మామా-కోడళ్ల ముచ్చట్లు వైరల్.. సమంతపై నాగ్ ప్రేమ

టాలీవుడ్ మామ కోడళ్ల ముచ్చట్లు అందరికీ తెలిసిందే. నాగ్ మామ అంటూ ముద్దుగా పిలుస్తుంది సమంత. ముద్దుల కోడలా ప్రియమైన కోడలా అంటూ నాగార్జున సమంతపై ప్రేమను కురిపిస్తాడు. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, మాట్లాడే మాటలు అక్కినేని అభిమానులను తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా సమంత తన కొత్త బ్రాండ్ దుస్తులను లాంచ్ చేసింది.

Nagarjuna Praises Samantha For Launching Saaki World
Nagarjuna Praises Samantha For Launching Saaki World

ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలని చిన్నతనంలోనే కలలు కన్నానని, ఒకప్పుడు మంచి దుస్తులు కూడా ధరించే స్థాయిలో లేనని పేర్కొంది. కానీ ఇప్పుడు తాను దేశంలో అత్యధిక ఖరీదైన ఫ్యాషన్ డిజైనర్‌లు తయారు చేసిన దుస్తులను ధరిస్తున్నానని తెలిపింది. తక్కువ ధరలో అందరూ కొనేందుకు వీలుండేట్టుగా అద్భుతమైన డిజైన్లు అందించాలని అందుకే సాకీ వరల్డ్‌ను తీసుకొచ్చానని వెల్లడించింది.

Nagarjuna Praises Samantha For Launching Saaki World
Nagarjuna Praises Samantha For Launching Saaki World

నేడు సాకీ వరల్డ్ బ్రాండ్ దుస్తులను సమంత లాంచ్ చేసింది. ‘గుడ్ మార్నింగ్ డియర్ కోడలా.. కొత్త బ్రాండ్ దుస్తులను ప్రారంభిస్తున్నావ్ కంగ్రాట్స్.. అంతా మంచే జరగాలి.. నాకు తెలుసు నువ్ దూసుకుపోతావ్’ అని సమంత సాకీ లాంచింగ్‌ను నాగార్జున ప్రమోట్ చేశాడు. ఇక నాగ్ అందించిన విషెస్ చూపించిన ప్రేమకు సమంత స్పందించింది. థ్యాంక్యూ సో మచ్ మామా అంటూ లవ్ సింబల్‌ను షేర్ చేసింది.