ఎఫ్ 3 లో నాగార్జున ..ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకి ..?

టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదిచుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది ప్రారంభం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 తెరకెక్కించాలని సన్నాహాలు చేశాడు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటిస్తాడన్న ప్రచారం జరిగింది.

F2 Fun and Frustration Review - tollywood

అయితే ఆ తర్వాత కరోనా కారణంగా అన్ని సినిమాల పరిస్థితి తారుమారు అయింది. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట కమిటయ్యాడు. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుంది. కాగా అనిల్ రావిపూడి అనుకున్న ఎఫ్ 3 ప్రాజెక్ట్ ఇక ఈ ఏడాదికి లేనట్టే అనుకున్నారు. కాని తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. అయితే ఈ సినిమాలో చేయాల్సిన వెంకటేష్ నారప్ప సినిమా వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా కంప్లీట్ అయ్యాకే ఎఫ్ 3 మొదలవనుందని సమాచారం.

అయితే ఈ లోపు అనిల్ రావిపూడి టాలీవుడ్ కింగ్ నాగార్జున తో సినిమా చేస్తాడని టాక్ మొదలైంది. ఇప్పటికే ఇద్దరి మధ్యన కథా చర్చలు కూడా జరిగాయాని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అయితే అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో ‘రామారావు’ అన్న టైటిల్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు నాగార్జున సినిమా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో దర్శకుడు క్లారిటీ ఇస్తేనే నమ్మగలం. అయితే అనిల్ రావిపూడి నాగార్జున తో సినిమా అనగానే అందరూ ఎఫ్ 3 అని భావిస్తున్నారు. కాని అది కేవలం గాసిప్ మాత్రమే.