ఈ మధ్య వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా వెంకటేష్ వంటి స్టార్ హీరో కూడా ‘రానా నాయుడు’ వంటి ఓ అడల్ట్ వెబ్ సిరీస్‌లో నటించేశాడు. సరే.. అది విమర్శల పాలైందా.? ఇంకేదైనానా.? అనేది పక్కన పెడితే, ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నారుగా.
అలా ట్రెండ్ సెట్ చేయడానికి కింగ్ నాగార్జున కూడా రెడీ అవుతున్నారట. ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఓ యంగ్ డైరెక్టర్ నాగార్జున వద్దకు వచ్చాడట. కాన్సెప్ట్ నాగార్జునకు బాగా నచ్చేసిందట. ఖచ్చితంగా చేద్దామని మాటిచ్చాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించేందుకు ముందుకొచ్చిందనీ తెలుస్తోంది.
నిర్మాణ పరంగా ఈ వెబ్ సిరీస్ చాలా రిచ్‌గా వుంబోతోందనీ ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్. అన్నట్లు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.