నాగార్జున అమల కలిసి ఆలోచించినా సక్సస్ రావడం లేదు!

Nagarjuna and Amala

టాలీవుడ్ లో వారసత్వ హీరోల జోరు పెరిగిపోతూనే ఉంది. మెగా ఫ్యామిలీ ఓ వైవు ఇండస్ట్రీని కుదిపేస్తుంటే.. మరో వైపు నాగార్జున ఫ్యామిలీ హీరోలు తడబడుతున్నారు. ఇంకో వైపునుంచి రానా మెరుపు వేగంతో దూసుకు రావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలయ్య బాబు కూడా  మోక్షజ్ఞ విషయంలో ఆలోచనలో పడ్డాడు.  ఇలా ఎవరి దారిలో వారు తమ వారసత్వ హీరోల గురించే మదన పడుతున్నారు.

Akhil Akkineni
Akhil Akkineni

ప్రధానంగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి అక్కినేని వారసత్వంపై పడింది. అదే.. అఖిల్ కెరీర్ పై సందిగ్ధం నెలకొంది. ఇంకా అఖిల్ కెరీర్ గాడిలో పడలేదు. ఈ విషయంలో  నాగార్జున  అతడిని ఎలా తీర్చి దిద్దాలనుకుంటున్నాడు? అఖిల్ కెరీర్ పై నాగార్జున ఆలోచన ఏంటి? ఇవే.. ఇప్పుడు నాగార్జునను తొలిచి వేస్తున్న సమస్యలు. ఈ విషయంలో అమల కూడా  బాగా ఆలోచిస్తున్నదట. నాగార్జునతో అఖిల్ కెరీర్ గురించే మాట్లాడుతున్నదట.  సరైన విజయం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్.

ప్రస్తుతం `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందిస్తున్న `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించనున్న సినిమాలో అఖిల్ కనిపించనున్నాడు.  ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` రూపంలో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన `పుష్ప`లో నటిస్తోంది. సక్సెస్ ట్రాక్ మీద ఉన్న రష్మికను తీసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట.  అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఓ అగ్ర దర్శకుడితో అఖిల్  సినిమా చేసే   ఆలోచనలో ఉన్నారట నాగార్జున.