నాగబాబు యూట్యూబ్‌లో మన చానెల్ మన ఇష్టం పేరిట నిత్యం ఏదో టాపిక్ మీద మాట్లాడుతుంటాడు. తాజాగా రెండ్రోజుల నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరిలేషన్‌కు కమ్యూనికేషన్స్ ముఖ్యమని తన జీవితంలో జరిగిన ఘటనల గురించి నాగబాబు చెబుతూ నిహారిక విషయాన్ని ప్రస్థావించాడు. నిహారిక పదో తరగతిలో ఉత్తరాంచల్‌కు విహారయాత్రకు వెళ్లాలని మంకు పట్టు పట్టిందిట.
అయితే పది రోజులు కూతురు ఎక్స్‌కర్షన్ వెళ్తే ఎలా అని భయమేసి వద్దని నాగబాబు వారించాడట. కానీ నిహారిక మాత్రం బతిమిలాడుతూనే ఉందట. అయితే నీ వెంట బాడీగార్డ్స్‌ను పంపిస్తాను దానికి ఒప్పుకుంటే తాను కూడా ఓకే అంటానని నాగబాబు నిహారికకు కండీషన్ పెట్టాడట. కానీ నిహారిక ఒప్పుకోలేదట. అయితే ఒక రోజు ఉదయాన లేచేసరికి నాగబాబు ముందు ఓ లెటర్ ప్రత్యక్షమైందట.
ఇక మాటలతో చెబితే వినడం లేదని అలా ముద్దు ముద్దుగా ఓ లెటర్ రాసిందట. నా ఫ్రెండ్స్ నంబర్లు ఇస్తాను. నా టీచర్ల నంబర్లన్నీ ఇస్తాను.. రోజూ మూడుసార్లు ఫోన్ చేస్తాను.. ఎక్కడికి వెళ్లినా లొకేషన్ చెబుతాను.. సిగ్నల్ లేకపోయినా ఎలాగైనా సరే ఫోన్ చేస్తాను.. ప్లీజ్ వెళ్లనివ్వు నాన్నా.. అంటూ నాగబాబుకు ఇష్టమైన నిహారిక ఫోటోలను పెట్టి కాకపట్టిందట. ఆ లెటర్, నిహారిక ఫోటోలను చూని నాగబాబు ఐస్ అయిపోయాడట. అలా కమ్యూనికేట్ చేసే ఫ్రీడం పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాలని నాగబాబు చెప్పుకొచ్చాడు.