డైరెక్టర్ బాబి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న థియేటర్స్ లో రాబోతుంది.ఈ మధ్యకాలంలో సినిమాలకి బెనిఫిట్ షో లు వేయడం అయిపోయింది. అయితే పుష్ప 2 సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ వల్ల టికెట్ల రేట్లు పెంచడం స్పెషల్స్ పర్మిషన్ ఇవ్వడం జరగదని రేవంత్ రెడ్డి చెప్పటంతో సినీ నిర్మాతల ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే విషయంపై డాకు మహారాజ్ నిర్మాత నాగ వంశీ తన అభిప్రాయాలని ఈ విధంగా చెప్పుకొచ్చారు.
డాకు మహారాజు సినిమా విశేషాల గురించి మాట్లాడటం కోసం ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు నాగవంశీ. అందులో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షో లు లేవని సీఎం గారు చెప్పారు కదా మరి మీరు ఏం చేస్తారు అని నాగవంశీని అడిగితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజు గారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరం చర్చించుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నాగ వంశీ.
అంతేకాకుండా సంక్రాంతికి తన సినిమా కన్నా ముందు దిల్ రాజు గారి సినిమా గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి ఆయన సినిమా ఎలా ఉంటే నా సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పారు. అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నిస్తే కేవలం ఈ ప్రెస్ మీట్ డాకు మహారాజు సినిమా విశేషాలు కోసమే పెట్టాను దాని గురించి మాత్రమే అడగండి అన్నారు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉంటాయా అని నాగవంశీని అడిగితే.. సంక్రాంతి సినిమాలు వేటికీ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉండకపోవచ్చని నాగవంశీ అన్నాడు.
తమ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ మిడ్ నైట్ షోలు వేయడం తప్పయిందని నాగవంశీ గతంలో వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’కు కూడా మిడ్ నైట్ షోలు ఉండకపోవచ్చు. తెల్లవారుజామున షోలే అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని బట్టే ఆ షోలు కూడా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే నిర్మాతలందరూ దిల్ రాజు రాక కోసం ఆయనతో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.