Naga shourya : శౌర్యా కొత్త సినిమా కోసం సమంత.. పాట ను విడుదల చేయనున్న సామ్…!

Naga Shourya : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.వరుస సినిమా లు చేస్తూనే ఉన్న ఆశించినంత విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఛలో సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న ఆ తర్వాత ఆ విజయాన్ని సరిగా వాడుకోలేక పోయాడు. కణం లాంటి ప్రయోగాలు చేసిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.ఇక అమ్మమ్మ గారి ఇల్లు ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చినా టెలివిజన్ లో అయితే చూడొచ్చు అనేలా ఉంది. ఇక ఇటీవలే వచ్చిన అశ్వధామ కూడా నిరాశను మిగిల్చింది.

ఇక నాగ శౌర్యా ప్రస్తుతం డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సినిమా కృష్ణ వ్రీందా విహారి.ఈ సినిమా లో నాగ శౌర్య కు జోడిగా షిర్లే షెటియా హీరోయిన్ గా నటిస్తోంది.నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ‘ఐరా’ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ తాలూకా ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.రేపు చిత్రంలోని ‘వర్షంలో వెన్నెల’ పాటను క్రేజీ బ్యూటీ సమంత విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

గతంలో ‘ఓ బేబీ’ సినిమాలో నాగశౌర్య – సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో శౌర్య సినిమాకు తన వంతు సాయం చేయబోతుందట సమంత.రేపు శనివారం ఉదయం 11.09 గంటలకు లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధికా కీలక పాత్రలో నటిస్తుంది. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు.