రిపీట్ మూడ్‌లో నాగశౌర్య.!

‘రంగబలి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ముద్దుగుమ్మ యుక్తి తరేజ. సినిమా సూపర్ హిట్. పాపకీ మంచి పేరొచ్చింది. ఇంకేముంది.! యుక్తి తరేజ మేకర్ల దృష్టిలో పడిపోయింది. మేకర్ల సంగతి అటుంచితే, హీరో నాగ శౌర్యను బాగా ఇంప్రెస్ చేసింది యుక్తి తరేజ.

పనిగట్టుకుని మరీ యుక్తిని ప్రమోట్ చేస్తున్నాడు నాగ శౌర్య. సినిమా ప్రమోషన్లతో పాటూ, హీరోయిన్‌నీ ప్రమోట్ చేయడం పనిగా పెట్టుకున్నట్లున్నాడు నాగశౌర్య. అంతేకాదు, తనతో ఇంకో సినిమాలో యుక్తికి ఛాన్సిచ్చాడట కూడా. మంచి డాన్సర్. టాలెంట్ వున్న అమ్మాయే యుక్తి. ఆ టాలెంట్ ముందుగానే గుర్తించి నాగ శౌర్య ఇదంతా చేస్తున్నాడా.? లేక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా వుందా.?

గతంలో రష్మిక మండన్నా గురించి కూడా ఇలాగే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. స్టార్ హీరోయిన్ అవ్వదగ్గ కళ వుందన్నాడు. రష్మిక సక్సెస్ అయ్యింది. అలాగే, ఇప్పుడు యుక్తి విషయంలోనూ నాగశౌర్య జోస్యం చెబుతున్నాడు.

సహజంగానే నాగ శౌర్య హీరోయిన్లతో హెల్దీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఎందుకో ‘కణం’ టైమ్‌లో సాయి పల్లవి విషయంలోనే తేడా కొట్టింది కానీ, తన హీరోయిన్స్ అందరితోనూ శౌర్య ఇదే మాదిరి వుంటాడు.