Thandel Movie: నవ యువ సామ్రాట్ నాగచైతన్య, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న రెండో చిత్రం ’తండేల్’ పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ మూవీకి కార్తికేయ2 ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ తండేల్ సినిమాను తెరకెక్కించడం విశేషం.
వాస్తవ ఘటనలతో రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు ఇతర పరిస్థితులను చాలా గ్రిప్పింగ్‌గా, ఆకర్షణీయంగా తెరపై మలుస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి. అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళంలోని పురాతన శివాలయం శ్రీముఖలింగం సన్నిధిలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా కోసం మునుపెన్నడూ చూడని రీతిలో ఓ ప్రత్యేక శివరాత్రి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Thandel: నాగ చైతన్య ‘తండేల్’- 1000 మంది ఆర్టిస్టులతో స్పెక్టాక్యులర్ శివరాత్రి సాంగ్ షూట్
ఈ క్రమంలో ఇప్పటికే శివరాత్రి ఉత్సవ వైభవాన్ని తెలియజేసేలా భారీ సెట్టింగ్‌లు మరియు అత్యంత వ్యయంతో అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు వేలాది మంది డ్యాన్సర్‌లతో కలిసి డ్యాన్స్ చేశారు.
అయితే ఈ పాట నాగ చైతన్య సాయి పల్లవిల కెరీర్‌లోనే మోస్ట్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా ఉండబోతుండగా దసరా పర్వదినం సందర్భంగా త్వరలోనే ఈ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు తాజాగా పాట షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. కాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందకు రెడీ అవుతున్నారు. త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.