హిట్టు కోసం నాగచైతన్య ఎదురుచూపు… చందు మొండేటి తో కొత్త చిత్రానికి ప్లాన్‌

అక్కినేని నాగ చైతన్య తదుపరి ప్రాజెకక్టు నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. కస్టడీ సినిమా అనంతరం నాగ చైతన్య,సాయిపల్లవి జంటగా కార్తికేయ2 వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌2 బ్యానర్‌లో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య జన్మదినం సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేశారు. సినిమాకు తండేల్‌ అని పేరు పెట్టారు. సమయాన్ని, ప్రజల కోసం ఇబ్బందులకు వ్యతిరేకంగా గా పోరాడడానికి ఓ నాయకుడు పుట్టాడు అంటూ ట్యాగ్‌ లైన్‌ను జత చేశారు.

ఇప్పుడు ఈ పోస్టు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. గతకొంతకాలంగా అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒక సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాగా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది.

నాగ చైతన్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ’తండేల్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో పడవలో ఉండి శత్రువులతో పోరు చేస్తూన్నట్లు యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు నాగ చైతన్య.