సమంతతో విడాకులు తీసుకున్నాకా, శోభిత ధూళిపాళ్లతో చైతూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ‘సంబంధం లేని మూడో వ్యక్తిని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చి దుష్ర్పచారం చేయడం తనకెంతో బాధగా వుంది..’ అని శోభిత విషయంలో చైతూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కానీ, ఆ సర్టిఫికెట్ బెడిసికొట్టింది. ఎందుకంటే, ఈ గాసిప్స్ వచ్చిన కొత్తల్లోనే చైతూ ఇలా స్పందించి వుంటే బాగుండేది. కానీ, ఆలస్యమైపోయింది. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. పాపం నాగచైతన్య ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఈ రకంగా శోభితకు అండగా నిలవాలనుకున్నాడు కాబోలు.. కానీ, అస్సలు వర్కవుట్ కాలేదు.
ఇదిలా వుంటే, నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో చైతూ యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’లో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.