టాలీవుడ్ టాప్ జంటలు అంటే సమంత చైతన్య, అల్లు అర్జున్ స్నేహారెడ్డి, రామ్ చరణ్ ఉపాసన అంటూ ఇలా ఓ పెద్ద లిస్టే ఉంటుంది. అయితే ఇందులో రామ్ చరణ్ ఉపాసనలకు సంతానం ఎప్పుడు కలుగుతుంది.. సమంత చైతన్యలు ఎప్పుడు శుభవార్త చెబుతారు అంటూ ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురువుతుంటాయి. అయితే ఇలాంటి తమ పర్సనల్ అంటూ దాట వేస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువయ్యేసరికి ఒక్కోసారి అసహనం ప్రదర్శిస్తుంటారు.
అయితే తాజాగా సమంత చైతన్యలు మాత్రం ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు. తాము ఇప్పుడే తల్లిదండ్రులు కావాలని అనుకోవడం లేదని చెప్పకనే చెప్పేశాడు. ముఖ్యంగా చైతన్యే దూరంగా ఉంటున్నాడని అర్థమవుతోంది. తాజాగా ఈ ఇద్దరూ ఓ ప్రకటనలో నటించారు. మింత్ర అనే యాప్ కోసం యాడ్ చేశారు. ఇందులో అన్ని వయస్సుల వారికి అన్ని రకాల డిజైనర్ బ్రాండెడ్ దుస్తులు లభిస్తాయని చెబుతూ అసలు విషయాన్ని పరోక్షంగా చెప్పారు.
పండుగ కోసం తాను షాపింగ్ చేస్తానని సమంత చెబితే వద్దని చైతన్య అంటాడు. నేనే చేస్తాను అంటూ మింత్ర యాప్ ఓపెన్ చేసి నాన్నకు ఈ డ్రెస్ బాగుంటుంది.. తమ్ముడికి ఇది బాగుంటుంది.. అమ్మకు ఈ చీర బాగుటుందని అంటోన్న చైతన్య దగ్గరి నుంచి ఫోన్ తీసుకుంటుంది సమంత. అమ్మకు ఈ కలర్ ఫేవరేట్ అంటూ చెప్పేస్తుంది. ఇక తరువాత చిన్న పిల్లలకు కావాల్సిన డ్రెస్సులు వస్తాయి.. దీంతో నాగచైతన్య సమంతను వెరైటీగా చూస్తాడు. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అనేస్తాడు. అంటే ఇప్పుడే పిల్లలు వద్దని పరోక్షంగా చెప్పేశాడు.