చైతూ వెళ్ళాడు.! బాలయ్యకు మైండ్ బ్లాంక్ అయ్యింది.!

అక్కినేని నాగచైతన్య వెళ్ళాడు.. నందమూరి బాలకృష్ణకి మైండ్ బ్లాంక్ అయ్యింది.! కొన్నాళ్ళ క్రితం ‘వీరసింహారెడ్డి’ మైకంలో నందమూరి బాలకృష్ణ, దివంగత అక్కినేని నాగేశ్వరరావుని ఉద్దేశించి ‘అక్కినేని.. తొక్కినేని..’ అంటూ వెటకారం చేసిన సంగతి తెలిసిందే.

‘ఎన్టీయార్, అక్కినేని.. లాంటి గొప్ప వ్యక్తుల్ని అవమానించడమంటే, మనల్ని మనం అవమానించుకున్నట్లే..’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు అక్కినేని నాగచైతన్య. అది బాలయ్యకు గట్టిగానే తగిలింది.

‘ప్రేమ అక్కడ లేదు.. మా దగ్గర వుంది’ అంటూ అక్కినేని వారసులపై బాలయ్య వేసిన సెటైర్.. ఈ వివాదం మరింత రాజుకునేలా చేసింది. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకలకు హాజరై, అక్కినేని నాగచైతన్య తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

చిన్నవాడైనా, నాగచైతన్య సంస్కారవంతుడు.! బాలయ్య ఎలాంటోడో ప్రూవ్ అయిపోయిందని సగటు సినీ అభిమాని అనుకుంటున్నాడిప్పుడు. అలా అనుకోవాలనే, నాగచైతన్య ఈ వేడుకకు హాజరయ్యాడన్నది ఇన్‌సైడ్ టాక్.!