Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో సమంత నాగచైతన్య ఒకరు. ఇద్దరు ఏం మాయ చేసావే సినిమా ద్వారా తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అనంతరం ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇలా ఇద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ కావడమే కాకుండా ఈ ఇద్దరు కూడా ప్రేమలో పడి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన సమంత నాగచైతన్య జీవితంలో ఒక్కసారిగా అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఇలా అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ పెళ్లైన మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య శోభిత అనే హీరోయిన్ తో మరోసారి పెళ్లి పీటలు ఎక్కారు.
ప్రస్తుతం నాగచైతన్య శోభిత తమ వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు అయితే సమంత మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చెప్పాలి. ఇకపోతే తన జీవితంలో శోభిత ఉన్నట్టు నాగచైతన్య సమంతకు ముందే చెప్పారు అంటూ ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియోలో భాగంగా సమంత నాగచైతన్య నటించిన ఏం మాయ చేసావే సినిమాలో ఒక సన్నివేశాన్ని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నాగచైతన్యతో సమంత బ్రేకప్ చెప్పుకొని చాలా రోజుల తర్వాత కలుస్తారు ఆ సమయంలో నాగచైతన్య మాట్లాడుతూ… అవును జెస్సి నా లైఫ్ లో వేరే అమ్మాయి ఉందని చెప్పగానే సమంత ఎలా ఉంటుంది తను అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో నాగచైతన్య ఆ అమ్మాయి పరిచయం గురించి, తన మంచితనం గురించి వివరిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో కొంతమంది అభిమానులు సమంతకు శోభిత గురించి నాగచైతన్య ముందే చెప్పాడు పాపం పిచ్చి సామ్ అప్పుడు గ్రహించలేకపోయింది అంటూ కామెంట్ లు చేయగా మరికొందరు ఈ డైలాగ్ చెప్పినప్పుడు తధాస్తు దేవతలు కూడా తధాస్తు అన్నట్టు ఉన్నారు అంటూ ఈ వీడియో పై సామ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.