నాగ చైతన్య సమంత కాంబో అంటే జనాలకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తెరపై ఈ ఇద్దరూ కనిపిస్తే చాలు అందరికీ కన్నుల పండువగా ఉంటుంది. అది వెండితెర అయినా బుల్లితెర అయినా ఈ ఇద్దరూ కలిస్తే ఓ మ్యాజిక్ ఏర్పడుతుంది. అందుకే యాడ్స్‌లోనూ ఈ ఇద్దరినీ తీసుకుంటారు. భార్యా భర్తలుగా ఈ ఇద్దరూ చేసే యాడ్స్ ఫుల్ వైరల్ అవుతుంటాయి. అలా ఈ ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెడితే ఇంకెలా ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు.
సమంత తన సామ్ జామ్ షోలో నాగ చైతన్యను గెస్ట్‌గా పిలిచింది. ఇప్పటికే ఏడు ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. ఇక ఈ చివరి ఎపిసోడ్‌లో అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. నాగ చైతన్యను తీసుకుని వచ్చి సమంత ముందు కూర్చొబెట్టారు. ఇక ఇన్ని ఎపిసోడ్‌లలో సమంత ప్రశ్నలు వేస్తే ఎదుటి వాళ్లు సమాధానాలు చెప్పేవాళ్లు కానీ ఈ సారి మాత్రం నాగ చైతన్య పంచ్‌కు సమంతకు షాక్‌ల మీద షాకులు వచ్చాయి. మొత్తానికి నాగ చైతన్యలోని రెండో కోణాన్ని ఈ ఎపిసోడ్ బయట పెట్టేలా ఉంది.
ఇంట్లోనే ఖాళీగా పడి ఉంటాడు.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు అని చివరకు పిలిచావా? అని వచ్చీ రాగానే సమంతపై సెటైర్ వేశాడు నాగ చైతన్య. ఇక చైతన్య ఫటా ఫట్ సెటైర్లు వేస్తుండటంతో సమంత షాక్ అయింది. హస్బండ్ మంచి మూడ్‌లో ఉన్నాడంటూ సమంత కామెంట్ చేయగా.. నేను ఎప్పుడూ కూడా మంచి మూడ్‌లోనే ఉంటాను అని నాగ చైతన్య రివర్స్ కౌంటర్ వేశాడు. దీంతో సమంత దెబ్బకు షాక్ అయింది. మొత్తానికి ఈ ఇద్దరి ముచ్చట్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్అవుతున్నాయి.