బిగ్ బాస్ సీజన్ 4 లో నిన్నంతా సరదా సరదాగా గడిచిపోయింది. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు నాగార్జున సాక్షిగా మరో అవకాశం కల్పించారు. ఇక నేడు ఎలిమినేషన్ కూడా ఉండనుంది. ఈ క్రమంలో సేవ్ అయ్యేవాళ్లని ప్రకటించే ప్రక్రియలో నాగార్జున వారితో గేమ్స్ ఆడించినట్లు తాజా ప్రోమోలో స్పష్టమవుతోంది. గేమ్స్ లో భాగంగా మ్యూజిక్ ప్లే చేసి..అది ఏ పాటో చెప్పాలని నాగ్ అడిగారు. దీంతో మ్యూజిక్ రాగానే కంటెస్టెంట్లకు బజర్ కొట్టే అవకాశం ఇచ్చారు. ముందు బజర్ కొట్టినవాళ్లు పాట పేరు చెప్పాలి అన్నమాట. ఈ క్రమంలో అవినాష్‌ను తికమకపెడుతూ భలే ఆడుకున్నారు నాగ్. అతడు కరెక్ట్ ఆన్సర్ చెప్పినా, మళ్లీ తప్పు చెప్పేలా కన్ఫూజ్ చేస్తూ ఫన్ రైజ్ చేశారు. ఆపై ‘కలర్ ఫుల్ చిలకా’ పాటకు ఇంటి సభ్యులంతా డ్యాన్స్‌తో హెరెత్తించారు. అనంతరం హారిక నామినేషన్ నుంచి సేఫైనప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూపించాలని నాగ్ అవినాష్‌ను కోరాడు. ఈ క్రమంలో అవినాష్ ఇమినేట్ చేసిన తీరుతో ఇంట్లో నవ్వులు పూశాయి.
అనంతరం క్యూబ్ ఆట ఆడించారు నాగ్. ఆటలో భాగంగా పలువురికి యాక్టివిటీలు ఇచ్చారు. ఈ క్రమంలో సోహైల్ నోటితో అవినాష్‌కు గోళ్ల రంగు వేశాడు. ‘ఎంత చక్కగా వేస్తున్నావ్’ అని నాగ్ అనగా..’నైట్ 9 తర్వాత అతడు చేసే పనులు ఇవే’ అంటూ అవినాష్ పై పంచ్ వేశాడు. ఆపై అవినాష్ శారీ కట్టుకుని ‘నిన్ను చూడకుంటే చాలు చెపంల్లోనా పింపుల్’ పాటకు డ్యాన్స్ వేశాడు. ‘పెంటాస్టిక్’ అన్న నాగ్..నీకు నైట్ 9 తర్వాత ఇదే పని అనుకుంట అనగానే అందూ ఫక్కున నవ్వారు. ముఖ్యంగా అరియానా పగలబడి నవ్వింది. ఇలా సరదా…సరాదాగా ప్రోమో గడిచిపోయింది.
అయితే సండే ఫన్ ఎంత ఉంటుందో చివర్లో ఎలిమినేషన్ కూడా అంతే స్థాయిలో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే లాస్య ఒప్పో సెల్ఫీ తీసుకుని బయటకు వచ్చేసిందట. మరోసారి మోనాల్‌ను బిగ్ బాస్ సేవ్ చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిన్న వచ్చిన కంటెస్టెంట్ల బంధువులు, ఫ్రెండ్స్ లో ఎక్కువమంది అభిజిత్ విజేత అవుతాడని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటే అతడే విన్నర్ అని అర్థమవుతోంది. మరి బిగ్ బాస్ ఇంట్లో ఏమైనా జరగవచ్చు. ట్విస్ట్ ఇవ్వడంలో దిట్టలు అయిన ఆ ఇంటి నిర్వాహకులు ఏం చేస్తారో చూడాలి.
Sunday special lo ultimate fun…Don’t miss #King in action#BiggBossTelugu4 today at 9 PM on @StarMaa pic.twitter.com/A80EB66KUI
— starmaa (@StarMaa) November 22, 2020