స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి పాపులారిటీ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సమంత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆమె చేతిలో ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు, వెబ్ సిరీస్ ఆఫర్లు ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవడం సమంతకే సాధ్యమైందని చెప్పవచ్చు.
అయితే చైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు అక్కినేని ఫ్యామిలీ 200 కోట్లు ఆఫర్ చేసిందని 300 కోట్లు ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో ఒకానొక సమయంలో సమంత ఈ వార్తల గురించి రియాక్ట్ అయ్యి వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని చెప్పారు. అయితే చైతన్య శోభిత విడాకుల నేపథ్యంలో మళ్లీ ఈ వార్తలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
వాస్తవానికి సమంత ఇండిపెండెంట్ గా జీవించడానికి ఇష్టపడతారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆమె భరణం కోరలేదు. వాస్తవానికి సొంతంగా ఆదాయం ఉన్నవాళ్లకు కోర్టులు సైతం భరణం ఇవ్వాలని చెప్పవు. సమంత, నాగచైతన్య మనస్పర్ధల వల్ల విడిపోయారే తప్ప వాళ్లు విడిపోవడానికి అంతకు మించిన ప్రత్యేకమైన కారణం అయితే లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అక్కినేని ఫ్యామిలీ సమంతకు భరణం ఆఫర్ చేసినట్టు జరిగిన ప్రచారంలో సైతం నిజం లేదు. సమంత దృఢమైన మనస్తత్వం ఉన్న మహిళ అని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలో సమంతకు తెలుసని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సమంత మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ ప్రాజెక్ట్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సమంత కెరీర్ ప్లానింగ్ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.