Nadiya : మహేష్ సినిమాలో నటించడానికి నో చెప్పిన నదియా…!

Nadiya : ఒకప్పుడు హీరోయిన్ గా దుమ్ముదులిపిన నదియా… ప్రస్తుతం కూడా అత్త, అమ్మ పాత్రలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఫామ్ లో ఉంది. ఐదు పదుల వయసులో కూడా హీరోయిన్ లతో సరిసమానంగా బ్యూటీని మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ తెరమీద నదియా కనిపించగానే అభిమానులు వావ్ అంటున్నారు. తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటోంది.

మిర్చి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించిన నదియా స్టైలిష్ మామ్ గా ఆకట్టుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించిన నదియా ఆ పాత్రలో జీవించేసింది అనే చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన త్రివిక్రమ్, సమంత, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన అ ఆ సినిమాలో నితిన్ కు అత్తగా సమంతకు తల్లిగా నటించిన నదియా తన నటనా ప్రతిభ ఇంక తన బ్యూటీ తో అందరిని ఆకట్టుకుంది.

కానీ నదియా విషయంలో ఈ మధ్య ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మన సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన సైలెంట్ హిట్ మూవీ స్పైడర్ లో చేయడానికి నదియా నో చెప్పేసిందట. వివరాలలోకి వెళితే స్పైడర్ సినిమాలో మహేష్ బాబు తల్లిగా మొదట నదియా ని అనుకున్నారట. మహేష్ బాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ నదియా ఆ సినిమాలో తన పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదని మహేష్ బాబు సినిమాలో చేయడం చాలా ఇష్టమని కాకపోతే ఈ సినిమా నేను చేయలేను అని మొహం మీద చెప్పేసిందట. అలా అన్నీ కుదిరి ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా తల్లి పాత్రలో నదియా ని చూసే వాళ్ళం. ఇంకొకసారి ఇలాంటి అవకాశం వస్తుందో లేదో.