ఇస్మార్ట్ బ్యూటీస్ మధ్య అదే తేడా .. అందుకే నిధి ఇక్కడే ఉంటే నభా ఎక్కడికో వెళ్ళిపోయింది..!

పూరి జగనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీస్ గా టాలీవుడ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నారు నిధి అగర్వాల్, నభా నటేష్. ఈ సినిమాకంటే ముందు నిధి అక్కినేని హీరోలతో సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు నిధి కి సక్సస్ ఇవ్వలేకపోయాయి. అలాగే నభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమా చేసింది. ఈ సినిమాతో నభా కి మంచి పేరే వచ్చింది గాని.. మళ్ళీ టాలీవుడ్ లో మంచి ఛాన్స్ మాత్రం రాలేదు. కాని ఒకే సినిమాలో ఇద్దరికి స్టార్ స్టేటస్ ని తెచ్చి పెట్టాడు పూరి.

iSmart Shankar Movie HD Images Ram Pothineni Nidhi Agarwal Nabha Natesh  637c94a – New Movie Posters

ఈ సినిమా తర్వాత నభా బాగా దూసుకుపోతుంది. రవితేజ తో డిస్కో రాజ సినిమా చేసింది. అలాగే సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా కంప్లీట్ చేసింది. ఇక రీసెంట్ గా నితిన్ నటించబోతున్న బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ అంధాదున్ లో నభా హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఈ సినిమా కాకుండా మరోసారి రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్న సినిమాలో కూడా ఛాన్స్ దక్కిందని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా ఇలా వరసగా అవకాశాలు అందుకుంటుందంటే నభాలో ఉన్న ఎనర్జీ యాక్టివ్‌నెస్ అని చెప్పుకుంటున్నారు.

ఆ దూకుడు నిధి చూపించలేకపోతుందని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు నిధి పోషించిన క్యారెక్టర్స్ లో అంతగా ఫన్ లేకపోవడం కాస్త మైనస్ అయింది. నిధి బ్యూటీగా ఉంటుంది. స్క్రీన్ మీద గ్లామరస్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. హాట్ గాను పర్ఫార్మ్ చేస్తుంది. కాని ఇప్పటి వరకు నిధికి ఉషారైన క్యారెక్టర్ పడకపోవడమే అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నిధి చేతిలో గల్లా అశోక్ సినిమా ఒకటే ఉంది. మిగతావి చర్చల దశలో ఉన్నాయంటున్నారు గాని ఖచ్చితంగా కన్‌ఫం అయిన ప్రాజెక్ట్ ఏదీ లేదని తెలుస్తోంది.