నెటిజన్లు ఒక్కో సారి శ్రుతి మించిపోతుంటారు. సోషల్ మీడియాలో అందరూ ఒకేలా ఉండరు. సెలెబ్రిటీలు లైవ్‌లోకి వచ్చి నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉన్నప్పుడు కొన్ని సార్లు ఊహించని ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా ఇస్మార్ట్ పోరి నభా నటేష్‌కు కూడా అలాంటి ఓ వింత ప్రశ్నే ఎదురైంది. యంగ్ హీరోయిన్ ఆ ప్రశ్నను చూసి దెబ్బకు ఖంగుతింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
ప్రస్తుతం నభా నటేష్ ఇక్కడే హైద్రాబాద్‌లోనే ఉంది. రామోజీఫిల్మ్ సిటీలో సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్‌లో పాల్గొంటోంది. సాంగ్ షూట్‌లో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి స్టెప్పులేస్తోంది నభా నటేష్. అయితే షూటింగ్ అయ్యాక నభా తన అభిమానులతో చిట్ చేసింది. ఏదైనా అడగండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ తమ ప్రతిభకు మెరుగులు దిద్దారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రశ్నలు సంధించారు.
వీరిలో కొంతమంది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా గురించి అడిగారు. ఇంకొందరు పబ్ జీ అడుతావా? అని అడిగేతా ఆడను అని సమాధానం ఇచ్చింది. తెలుగులో మాట్లాడండి అంటే.. డిన్నర్ టైం అయింది.. ఇంకా ఫుడ్ రాలేదు ఆకలి అవుతోంది అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడింది. ఇక ఓ నెటిజన్ మాత్రం నీకు పెళ్లి అయిందా? అంటూ ప్రశ్నించాడు. దీంతో హీరోయిన్ ఫేస్ దెబ్బకు బ్లాంక్ అయింది. ఎలా కనబడుతున్నాను.. నాకు పెళ్లి కాలేదు అంటూ మూతి తిప్పుకుంది. నాటు కోడిలా మంచి వయసు మీద హీరోయిన్‌ను పట్టుకుని అలాంటి ప్రశ్న అడిగితే ఫీలవ్వదా మరి.