చీరకట్టులో నభా.. అందంతో కట్టిపడేసిందబ్బా!!

ఇస్ట్మార్ట్ పోరి నభా నటేష్ చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నా తనకు తానే సాటి. నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ కన్నడ భామకు ఒక్క సినిమాతోనే భారీ ఫాలోయింగ్ వచ్చింది. మొదటి సినిమాలో అందంగా కనిపించి, ముద్దుగా అల్లరి పిల్లగా నటించిన నభాకు టాలీవుడ్ ఫిదా అయింది. అలా రెండో చాన్స్‌గా ఇస్మార్ట్ శంకర్ లభించింది. ఈ చిత్రంతో నభా ఫేట్ పూర్తిగా మారిపోయింది.

Nabha Natesh Latest Saree pics Goes Viral
Nabha Natesh Latest Saree pics Goes Viral

తెలంగాణ యాసలో నభా నటించి, యాటిట్యూడ్ చూపించి మెప్పించింది. దెబ్బకు నభా ఇస్మార్ట్ పోరిగా ప్రేక్షకుల గుండెల్లో తిష్ట వేసింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత మళ్లీ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి కాస్త టైం తీసుకుంది. మామూలుగా అయితే సమ్మర్‌లో ఓ సినిమాతో వచ్చేది. కానీ కరోనా లాక్డౌన్ వంటివి రావడంతో అది మిస్ అయింది. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో నభా నటించింది.

Nabha Natesh Latest Saree pics Goes Viral
Nabha Natesh Latest Saree pics Goes Viral

ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అయితే లాక్డౌన్‌లో నభా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఫోటో షూట్లతోనే పిచ్చెక్కించింది. చేనేత దినోత్సవం సందర్భంగా చీరకట్టులో మెరిసిన నభా తన భారీ అందాలతో కుదిపేసింది. తాజాగా మరోసారి చీరకట్టుతో సోషల్ మీడియాను కట్టిపడేసింది. ఈ ఫోటోలతో నభా నేషనల్ వైడ్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్అయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్అవుతున్నాయి. నభా ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాబోతోన్న అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తోంది.