మేకప్ రూంలోనే కానిచ్చేస్తోంది.. నభా నటేష్ !!

ఇస్మార్ట్ పోరి నభా నటేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది రెండు మూడు సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ కన్నడ సుందరికి తెలుగులో ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది. నన్ను దోచుకుందువటే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నభా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పీక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం నభా మాత్రం తెలుగులో యంగ్ హీరోలకు పర్ఫెక్ట చాయిస్ అనిపించుకుంటోంది.

Nabha Natesh eating In Make Up Room
Nabha Natesh eating In Make Up Room

ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం కోసం నభా ఇప్పుడు పని చేస్తోంది. అల్లుడు అదుర్స్ అంటూ బెల్లంకొండ చేస్తోన్న సందడిలో నభా కూడా పాలు పంచుకుంటోంది. ఈ మధ్యే నితిన్ చిత్రంలో ఎంపికైంది. అంధాదున్ రీమేక్‌లో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా నటేష్ చేస్తోంది.

తాజాగా నభా ఓ వీడియోను షేర్ చేసింది. తన మేకప్ రూంలోనే తింటూ బిజీ బిజీగా ఉంది. తినడానికి కూడా సరైన టైం దొరకనంత బిజీగా నభా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే మేకప్ రూంలోనే మేకప్ వేసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా అక్కడే తినేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలో నభా లుక్స్ వైరల్ అవుతున్నాయి. చీరలో నభా అందాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.