హ హ నాకా? భయమా?.. నభా వ్యవహారం మామూలుగా లేదు!

Nabha Natesh about ghosts

ఇస్మార్ట్ చిన్నది నభా నటేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. చీరకట్టులో,మోడ్రన్ డ్రెస్‌లోనూ కవ్వించే చాందినీయే నభా నటేష్. సినిమా పాత్రల్లో జీవించడంలో నభా నటేష్‌ను మించిన వారు లేరు. తెలంగాణ యాసలో నభా నటనకు అందరూ ఫిదా అవుతుంటారు. అలా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టేసింది. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మళ్లీ సక్సెస్ సాధించింది.

Nabha Natesh about ghosts
Nabha Natesh about ghosts

అయితే ఆమె నటించిన అల్లుడు అదుర్స్ మాత్రం బోల్తా పడింది. కానీ నభా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. గ్లామర్ పరంగానూ నభా ఇంకో మెట్టుకు ఎక్కేసింది. అలా నభా తన సినిమాలతో ఎంత ఫాలోయింగ్ సంపాదించుకుంటుంటో.. సోషల్ మీడియాలో తన యాక్టివిటీస్‌తో అంతకు మించి అభిమాన గణాన్ని సంపాదించుకుంటోంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

తాజాగా నభా నటేష్ తన ఫ్యాన్స్‌తో ఓ ఆట ఆడింది. ట్రూ ఆర్ ఫాల్స్ అంటూ గేమ్‌ను ప్రారంభించింది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు నిజమా? కాదా? అని సమాధానం చెప్పింది. నీకు దెయ్యాలంటే ఇష్టమా? అని ఓనెటిజన్ అడిగితే అదిరిపోయేలా రిప్లై ఇచ్చింది. నాకా? భయమా? అంటూ కౌంటర్ ఇస్తూ.. మస్త్ యాటిట్యూడ్‌ను చూపిస్తూ కళ్లజోడు పెట్టుకుని నాకు అసలు భయమే లేదంటూ చెప్పుకొచ్చింది.