జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ చేయాలనేది నా కోరిక.. అశ్వినీ దత్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఐదు దశాబ్దాల నుంచి నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలు చేస్తూ నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అశ్వినీ దత్ శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే తాజాగా సీతారామం వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా నిర్మాత అశ్విని దత్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బ్యానర్లో చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పటికీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కనుక తలుచుకుంటే తనకు ఎంతో ఆనందం కలుగుతుందని ఈయన తెలిపారు. ఎప్పటికైనా నా బ్యానర్లో ఈ సినిమాకి పార్ట్ 2 తీయాలని ఆలోచనలో ఉన్నానని అయితే అది ముందుకు సాగడం లేదని తెలిపారు. నా బ్యానర్లో అదే ఆఖరి చిత్రం కూడా కావాలని ఈయన కోరుకున్నారు.

ఒకవేళ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కనక చేస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఈయన హీరో పేరు చెప్పారు. కాకపోతే అది మనకు వినిపించలేదు. ప్రోమో కావడంతో ఈ పేరును హైడ్ చేశారు.ఇది చూసిన మెగా అభిమానులు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా కనుక చేస్తే తప్పకుండా రాంచరణ్ తోనే చేయాలని భావిస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో చిరంజీవి కూడా ఈ సినిమా రామ్ చరణ్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో చేస్తే బాగుంటుందని ఒక సందర్భంలో వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు కాకపోయినా మరి కొద్ది రోజుల్లో అయినా కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సీక్వెల్ వస్తుందని చెప్పవచ్చు.