పెళ్లి తర్వాతే నేను హీరో అనే విషయం నా భార్యకు తెలిసింది: అల్లరి నరేష్

ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ కుమారుడిగా అల్లరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు నరేష్.ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో సినిమా పేరు తన పేరుకు ముందు వచ్చి చేరి అల్లరి నరేష్ గా మారిపోయారు.ఇలా తన తండ్రి బ్రతికి ఉన్నన్ని రోజులు ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను అందుకున్న అల్లరి నరేష్ తన తండ్రి మరణాంతరం సినిమాల ఎంపిక విషయంలోనూ తడబడటంతో వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి.

ఈ విధంగా వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడటంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నరేష్ తిరిగి నాంది సినిమాతో తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు.తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి విజయమందుకున్నారు.ఇకపోతే ఈయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశారు.

ఈ క్రమంలోనే తన భార్యవిరూప గురించి మాట్లాడుతూ ఆమె చెన్నైలో పుట్టి పెరగటం వల్ల తెలుగు సినిమాల పట్ల తనకు పెద్దగా అవగాహన లేదని తెలిపారు.దీంతో తెలుగు సినిమాలు కూడా ఎక్కువగా చూసేది కాదని ఒకవేళ చూసినా స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చూసేదని తెలిపారు. ఇకపోతే తాను ఇండస్ట్రీలో ఉన్నానని తెలుసుకున్న టువంటి ఈమె హీరోగా కాకుండా ఇతర డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నానని భావించారట. పెళ్లి జరిగిన తరువాత తాను హీరోననే విషయాన్ని తెలుసుకున్నట్టు ఈ సందర్భంగా నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.