నా భర్త సినిమా హిట్‌.. ఎంతో హ్యాపీగా ఉంది

alia-bhatt-3

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన ‘యానిమల్‌ చిత్రం ఇప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపుతున్నది. బోల్డ్‌ అండ్‌ రష్టిక్‌ స్టోరీతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలవగా అన్ని చోట్లా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతున్నది. తెలుగు నాట సినిమాకు మిక్స్‌డ్‌ టాక్స్‌ వచ్చినప్పటికీ ఉత్తరాదిన ఈ చిత్రాన్ని ఓ కల్ట్‌ సినిమాగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా రణబీర్‌ వన్‌ మ్యాన్‌ షోను చూసి ప్రేక్షకులు స్టన్‌ అయి పోతున్నారు. రణబీర్‌ జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచి పోతుందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ముఖ్యంగా అలియాభట్‌ ఈ రోజు కుటుంబంతో కలిసి సినిమా చూసిన అనంతరం సంతోషాన్ని కంట్రోల్‌ చేసుకోలేక యానిమల్‌ గురించి ,నటీనటుల గురించి ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచింది. చిత్రంపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. రణ్‌బీం గురించి మాట్లాడుతూ ‘కెమెరా ముందు, వెనకాల ఎంతో ప్రేమ, ఓర్పు కనబరుస్తూ కుటుంబంపై, సినిమాపై అనిర్వచనీయమైన ప్రేమను పంచుతూ నటుడిగా ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి ఎదిగి నీకు పనిపై ఉన్న నిబద్ధత , కష్టపడే తత్వంతో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న మన కూతురికి మంచి లక్ష్యాలు అందిచావ్‌.. మమ్మల్ని గర్వపడేలా చేశావ్‌ నీకు అభినందనలు యువార్‌ మై నాట్‌ సో లిటిల్‌ యానిమల్‌ అంటూ’ అభినందనలు తెలిపింది.

సందీప్‌ రెడ్డి గురించి మాట్లాడుతూ నీ లాగా మరొకరుండరు.. సినిమాలోని బీట్స్‌, చిత్రీకరణ మొత్తం షాకింగ్‌గా, నమ్మలేని విధంగా, ఆశ్చర్యం కలిగించేలా, గూస్‌బంప్స్‌ తెచ్చేలా విూ ఇమాజినేసన్‌ ఉందని కొద్ది రోజుల పాటు ఈ సినిమా హంట్‌ చేస్తుందంటూ పొగడ్తల వర్షంలో ముంచింది. ఇక ఆ తర్వాత రష్మిక గురించి మాట్లాడుతూ సినిమాలో విూరు అందంగా, నిజాయితీగా ఉన్నారని తెలిపింది.

నేను అంతకుముందే చెప్పినట్లు సెకండాఫ్‌ ఆ సీన్‌లో విూ నటన చాలా బాగా నచ్చిందని విూ క్రష్మిక ఫ్యాన్‌ క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నానని అన్నది. నాకు ఎంతో ఇష్టమైన బాబీ డియోల్‌ సినిమాలో ఔట్‌ స్టాండిరగ్‌ ఫెర్మార్మెన్స్‌ ఇచ్చారని, తెరపై కనిపించిన ప్రతీసారి ఓ మ్యాజిక్‌లా అనిపించిందని, ఇక అనీల్‌కపూర్‌ ఎప్పటిలాగే అద్భుత నటన కనబర్చి మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొంది. టోటల్‌ తారాగాణం వారి వారి పాత్రలకు జీవం పోశారంటూ చిత్రంలో నటించిన వారిని, దర్శకుడు సందీప్‌ రెడ్డిని పేరుపేరునా అభినందనలతో ముంచెత్తింది. దీంతో ఇప్పుడు అలియాభట పోస్టు సోషల్‌ విూడియాలో బాగా వైరల్‌ అవుతున్నది.